Header Banner

అమ్మకానికి స్టార్ హీరోయిన్ ఆస్తులు.. చివరకు ఆ ఇల్లు కూడా, కోట్లలో డీల్స్.. కారణం తెలిస్తే షాక్!

  Sat Mar 08, 2025 16:18        Entertainment

తనదైన నటనా ప్రతిభతో గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన విలాసవంతమైన బంగ్లా అమ్మేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కెరీర్ పరంగా పీక్స్ లో ఉండగానే ఇలా ఆస్తులు అమ్మేయడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలో ప్రియాంకకు చెందిన కొన్ని విలాసవంతమైన ఫ్లాట్‌లను ఇటీవల విక్రయించినట్లు ఇండెక్స్‌ ట్యాప్‌ వెల్లడించింది. వెస్ట్ ముంబయిలోని అంథేరి ప్రాంతంలోని ఒబెరాయ్‌ స్కై గార్డెన్స్‌లో ఉన్న ఈ ఫ్లాట్లు అత్యంత ఖరీదైనవి కావడంతో వాటికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ ప్రాంతంలో ప్రియాంకకు నలుగు ఫ్లాట్‌లు ఉండగా, ఆమె వాటిని మొత్తం రూ.16.17 కోట్లకు విక్రయించారు. 18వ అంతస్తులో మూడు ఫ్లాట్లు ఉండగా, వాటిని వరుసగా రూ.3.45 కోట్లు, రూ.2.85 కోట్లు, రూ.3.52 కోట్లకు అమ్మేశారు. అలాగే 19వ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్‌ను రూ.6.35 కోట్లకు విక్రయించారు. ఈ లావాదేవీలు మార్చి 3వ తేదీన పూర్తైనట్లు సమాచారం. ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌ ఇండియా కథనం ప్రకారం, ప్రియాంక 2021లో వెర్సోవాలో ఉన్న రెండు ఆస్తులను, 2023లో లోఖండ్‌వాలాలోని రెండు పెంట్‌హౌస్‌లను కూడా విక్రయించారు. ప్రస్తుతం ఆమె గోవా, న్యూయార్క్‌, లాస్‌ఏంజెలెస్‌లలో సొంత ఇల్లు కలిగి ఉన్నారు. భర్త నిక్‌ జోనస్, కుమార్తె మేరీ చోప్రా జోనస్‌తో కలిసి ఆమె లాస్ ఏంజెలెస్‌లో ఉంటున్నారు.

 

ఇది కూడా చదవండి: ఆ గాయం వల్ల ఎంతో బాధపడ్డా.. జీవితంలో క్లిష్ల పరిస్థితులను వివరించిన నటి రాధిక!

 

నిక్ తో పెళ్లి తర్వాత హాలీవుడ్ సినిమాలతో ఎక్కువగా బిజీగా ఉంటున్న ప్రియాంక చోప్రా.. ఇకపై బాలీవుడ్ వదిలేసి అక్కడే పర్మనెంట్ గా సెటిల్ కావాలని ప్లాన్ చేస్తోందట. ఇందులో భాగంగానే ఇలా వరుసపెట్టి ముంబైలోని ఆస్తులన్నీ అమ్మేస్తోందని టాక్. ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే.. హాలీవుడ్‌లో ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’, ‘ది బ్లఫ్‌’ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. అలాగే, ఆమె ప్రముఖ అమెరికన్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న #SSMB29లో కూడా ప్రియాంక నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతున్నట్లు టాక్. మహేష్ బాబు సినిమాలో గ్లోబల్ బ్యూటీ కనిపించనుండటం పట్ల టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) కథ అందిస్తుండగా.. ఇది సినీ చరిత్రలోనే ఓ గొప్ప సినిమాగా నిలవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే ఈ సినిమా కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ను రంగం లోకి దించిన జక్కన.. ఆమె రోల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ థియేటర్స్ షేక్ అయ్యేలా ఆమెను సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారట.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూ, వారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Bollywood #Mumbai #Priyanka